AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. 

పోస్టుల వివరాలు:

అంగన్వాడీ వర్కర్: 30
అంగన్వాడి హెల్పర్: 141
మొత్తం ఖాళీల సంఖ్య: 171

విద్యార్హతలు:

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి:

21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

ఎంపిక విధానం:

10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

దరఖాస్తు విధానం:

Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి. మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.

దరఖాస్తుకు చివరి తేదీ:

13-04-2026 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:

23-04-2026 తారీకున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:

సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link
Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!