Govt Jobs: తెలంగాణలో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..
సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, Army Ordnance Corps Centre నుంచి దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఫైర్ మెన్, ట్రేడ్స్ మన్ మేట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 2023 ఫిబ్రవరి 6వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 26వ తారీకు వరకు (21 రోజుల లోపు) ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. www.aocrecruitment.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ట్రేడ్స్ మన్ మేట్: 1249 పోస్టులు
ఫైర్ మెన్: 544 పోస్టులు
అర్హత:
10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
18 నుంచి 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC & ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ట్రేడ్స్ మన్ మేట్: 18,000/- నుంచి 56,900/-
ఫైర్ మెన్: 19,900/- నుంచి 63,200/-
దరఖాస్తు విధానం:
2023 ఫిబ్రవరి 6వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 26వ తారీకు వరకు (21 రోజుల లోపు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. www.aocrecruitment.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి