Telangana Jobs: రూ.లక్ష జీతంతో దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
Telangana Endowment Department Jobs : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
- లీగల్ ఆఫీసర్
- అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్
విద్యార్హతలు
లీగల్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి LLB/ LLM ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టు/ హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన వారై ఉండాలి.
అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి LLB/ LLM ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టు/ హైకోర్టులో కనీసం ఐదు సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. లేదంటే ప్రభుత్వ సంస్థలు కనీసం ఐదు సంవత్సరాలు లీగల్ ఆఫీసర్ గా పని చేసిన వారై ఉండాలి. హిందూ మతానికి చెందిన వారై ఉండాలి.
జీతభత్యాలు
- లీగల్ ఆఫీసర్: నెలకు రూ.1,00,000/-
- అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్: నెలకు రూ.44,000/-
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం లింక్ క్రింద ఇవ్వడమైనది
దరఖాస్తుకు చివరి తేదీ
2025 డిసెంబర్ 15వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు పంపవలసిన చిరునామా
The Commissioner, Endowments Department, Telangana Boggulakunta, Tilak Road, Abids, Hyderabad-500001.

