AP దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేవదాయ శాఖలో త్వరలో 500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అధికారికంగా తెలపడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో ఖాళీలు అలాగే అర్చక విభాగంలో ఖాళీల్ని త్వరలో భర్తీ చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డుల నియామకాలు చేపడతామన్నారు. దేవదాయ శాఖ కమిషనరేట్ లో అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
దేవాదాయ శాఖలోని ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.