TSPSC Group-2: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నెల వాయిదా?
TGPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయనున్నారు. నెలరోజుల పాటు వాయిదా వేసే దిశగా టీజీపీఎస్సీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోన్నట్లు సమాచారం.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను నెలరోజుల పాటు వాయిదా వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. డీఎస్సీ పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నందున.. రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు వేల సంఖ్యలో ఉండటంతో.. వెంట వెంటనే పోటీ పరీక్షలను నిర్వహిస్తే.. ఆ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంటుందని.. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయడం పై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
డీఎస్సీ పరీక్షలను ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్నారు. 6వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఖాళీగా ఉండి.. తిరిగి ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. రెండు పోటీ పరీక్షలకే మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంటుంది. పైగా రెండు పోటీ పరీక్షల సిలబస్ మొత్తంగా వేరు వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డీఎస్సీకి ఎంత ప్రియారిటీ ఉంటుందో గ్రూప్-2 పోస్ట్ కి కూడా అంతే ప్రియారిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయడానికి సంబంధించి టీజీపీఎస్సీతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షలను వాయిదా వేసి మరో తేదీల్లో నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని అంశాలను టీజీపీఎస్సీతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ పరీక్షలు ముగిసే లోపు ప్రభుత్వం నిర్ణయం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు.