December 26, 2024
AP Govt Jobs

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Guest Faculty Jobs: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APP Link

Whatsapp Group Link

Telegram Group Link

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నడుపబడుచున్న డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల నందు 2024-25 విద్యా సంవత్సరమునకు గాను డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలురు), దుప్పలవలస మరియు కొల్లివలస లో ఖాళీగా ఉన్న JL మాథ్స్ (పురుష అభ్యర్థులు మాత్రమే), మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికలు) మందసలో ఖాళీగా ఉన్న JL ఇంగ్లీషు, బోటని మరియు PGT మాథ్స్ (మహిళ అభ్యర్థులు మాత్రమే) మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికలు) నందిగాం లో ఖాళీగా ఉన్న JL మాథ్స్ (మహిళ అభ్యర్థి మాత్రమే) గెస్ట్ ఫాకల్టీ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డెమో ద్వారా ఎంపిక చేయబడెదరు. కావున ఆసక్తి గల పురుష మరియు మహిళ అభ్యర్థులు నుండి వారి బయోడేటా తో పాటుగా P.G., B.ED, మరియు TET (క్వాలిఫైడ్) ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ, ఆదివారంపేట, శ్రీకాకుళం జిల్లా, తేది: 15.06.2024 న అనగా శనివారం నాడు ఉదయం 10.00 గంటలు నుండి నిర్వహించబడు డెమోకు హాజరు కావలయును అని జిల్లా సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ, శ్రీకాకుళం జిల్లా శ్రీ ఎన్. బాలాజీ నాయక్ తెలియజేసియున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు హాజరు కాగలరు.

పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లుకు సంప్రదించవలెను:
08942-279926,
9701736862,
9000314209.

Notification Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!