రైల్వే శాఖలో రాతపరీక్ష లేకుండా 1,010 పోస్టుల పడితే కి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | Railway ICF Recruitment 2024
రైల్వే శాఖలో ఖాళీల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి 1010 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఐటిఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్:1,010 ఖాళీలు
ఖాళీలు గల ట్రేడులు:
కార్పెంటర్, ఎలక్టీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్డీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ.
విద్యార్హతలు:
ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2024 జూన్ 21వ తారీకు నాటికి 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.6000/- నుంచి రూ.7000/- స్టైఫండ్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జూన్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పైకి విచ్చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి