AP Govt Jobs: ఏపీ రెవెన్యూ శాఖలో రాతపరీక్ష లేకుండా DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కాంట్రాక్టు ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పని చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకున్నాము..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
👉విద్యార్హతలు:
కంప్యూటర్ సబ్జెక్టు గా గల ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సు నందు సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
👉దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 8వ తారీకు సాయంత్రం 4 గంటలకు అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వద్ద హాజరు కావాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.