APPSC: గ్రూప్-2 లేటెస్ట్ అప్డేట్.. దరఖాస్తు గడువు పొడగించండి
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఈనెల 10న ముగియనున్నది. దరఖాస్తు గడువు పొడిగించాలని నిరుద్యోగ ఐకాస అభ్యర్థన.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు రేపటితో(జనవరి 10న) ముగియనున్నది. అయితే దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు వెబ్ సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్ని సార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తోందని చెబుతున్నారు. దీంతో వివరాల నమోదు మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. ఈ కారణంగా దరఖాస్తు గడువును మరో 10 రోజులు పొడిగించాలని నిరుద్యోగులు, నిరుద్యోగ ఐకాస సభ్యులు కోరుతున్నారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 దరఖాస్తు గడువును పొడిగించే విధంగా ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని.. బోర్డు మెంబర్ పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25వ తారీకున నిర్వహించనుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి