IB Recruitment | 10th క్లాస్ అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 677 పోస్టులు భర్తీ
IB Recruitment 2023 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో పర్మినెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్: 362 పోస్టులు
2.మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్): 315 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 677.
విద్యార్హతలు:
◆మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ సెక్యూరిటీ అసిస్టెంట్: 10వ తరగతి పాసై, LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ లో ఏడాది అనుభవం కలిగి, మోటర్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
1.సెక్యూరిటీ అసిస్టెంట్: సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.మల్టీ టాస్కింగ్ స్టాఫ్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉండాలి.
జీతభత్యాలు:
1.సెక్యూరిటీ అసిస్టెంట్:
నెలకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు
2.మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
నెలకు రూ.18,000/- నుంచి రూ.56,900/- వరకు
ఎంపిక విధానం:
1.సెక్యూరిటీ అసిస్టెంట్:
టైర్-1 రాతపరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
2.మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
టైర్-1 రాతపరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
దరఖాస్తు ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 13వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో SSC GD Constable, AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి