TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాల నియామకంపై హైకోర్టు స్టే
TSPSC Group-4: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎంపికపై హైకోర్టు స్టే విధించింది. 30 రోజుల వ్యవధిలో అర్హత మార్కుల విషయమై నిర్ణయం తీసుకుని ఫలితాలు వెల్లడించాలని హోం కార్యదర్శి, టీఎస్పీఎస్సీలను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎంపికపై హైకోర్టు స్టే విధించింది. 30 రోజుల వ్యవధిలో అర్హత మార్కుల విషయమై నిర్ణయం తీసుకుని ఫలితాలు వెల్లడించాలని హోం కార్యదర్శి, టీఎస్పీఎస్సీలను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులను తగ్గించాలన్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వినతిపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొంది. కాగా నియామకాల్లో క్వాలిఫై మార్కుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని పలువురు మాజీ సైనికులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఏప్రిల్ 2022లో విడుదల చేసిన జీవో 55లో మాజీ సైనికులకు, ఓసీలకు 40% మార్కులు వస్తేనే అర్హులని పేర్కొన్నారని దీంతో ఈ జీవో తమకు శాపంగా మారిందన్నారు. దీనిపై సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, మాజీ సైనికులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే ఎలాంటి ఫలితం లేదన్నారు. దీంతో పలువురు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు తమకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా అర్హతమార్కులు తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్మెన్ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీచేశారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి