AP Grama Sachivalayam Jobs | 1896 పోస్టులతో గ్రామ సచివాలయం నోటిఫికేషన్.. డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు
AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని పశుపోషకులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే పశువైద్యం అందించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 పశుసంవర్ధక సహాయక పోస్టుల నియామకాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు తొలి విడతలో 3,033, రెండో విడతలో 1,619 పశుసంవర్ధక సహాయకులను నియమించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, త్వరలో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీని కూడా పూర్తి పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరీ-1 పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అతి తక్కువ ధరలో AP గ్రామ సచివాలయం, గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి