TSPSC Group 2 | తెలంగాణ గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ పట్టిక 2024 విడుదల
TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే జనవరి 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి