AP Government jobs: వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బ్యాక్ లాగ్ కేటగిరీ (ఎస్సీ) కింద ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.డ్రైవర్ (లైట్ వెహికల్): 01 పోస్టు
2.ఆఫీస్ సబార్డినేట్: 03 పోస్టులు
అర్హతలు:
1.డ్రైవర్ పోస్టులకు తెలుగు / ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
2.ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 47 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.డ్రైవర్: రూ.23,780 – రూ. 76,730.
2.ఆఫీస్ సబార్డినేట్: రూ.20,000 – రూ. 61,960.
ఎంపిక విధానం:
1.డ్రైవర్ పోస్టుకు ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్;
2.ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడో తరగతి మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి