TS DSC 2023 Notification: 6,612 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 33 జిల్లాల్లో ఖాళీలు భర్తీ
TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో 6,612 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) ద్వారా 5,089 సాధారణ ఉపాధ్యాయ ఖాళీలతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి 1,523 ప్రత్యేక విద్య టీచర్ల ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 6,612 పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు (డీఎస్సీ) నియామకాలు చేపడతాయని వెల్లడించారు. గురువారం (ఆగస్టు 24) నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. రెండు రోజుల్లో కాలపట్టిక, విధి విధానాలు జారీ చేస్తామని, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినందున జీవో కూడా రానుందని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. “ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తాం. అదే నెల 27న ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలిపారు.
టీచర్ పోస్టుల వివరాలు:
స్కూల్ అసిస్టెంట్లు: 1,739
సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575
భాషా పండితులు: 611
పీఈటీ పోస్టులు: 164
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523
మొత్తం పోస్టులు: 6,612
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి