AP Police Events 2023: ఎస్సై ఈవెంట్స్ వాయిదా!
AP SI Events 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు రేంజ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ (PET/PMT) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐజీ పాల్ రాజు వెల్లడించారు.
AP SI Events 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు రేంజ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ (PET/PMT) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐజీ పాల్ రాజు వెల్లడించారు. వర్షాల కారణంగా మైదానం సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని సెప్టెంబరు 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీల్లో జరగాల్సిన ఈవెంట్లు (PMT/PET) యథాతథంగా కొనసాగుతాయన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ ఉద్యోగాల నియమాకానికి చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో గుంటూరు రేంజ్ పరిధిలో 12,957 మంది అభ్యర్థులు అర్హత సాధించారని వెల్లడించారు. వీరిలో 11,048 మంది పురుషులు, 1,909 మంది మహిళలు ఉన్నట్టు వివరించారు. ఫిజికల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాలని సూచించారు. ఈనెల 30, 31, సెప్టెంబర్ 1న ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ తేదీల్లో వీలుపడని వారు అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పించినట్టు చెప్పారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.