Telangana Postal Jobs: తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని పోస్టల్ సర్కిళ్లలో 961 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 961 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆగస్టు 23వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
గ్రామీణ డాక్ సేవక్ (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్).
తెలంగాణలోని మొత్తం ఖాళీల సంఖ్య: 961
విద్యార్హతలు:
పదవ తరగతి పాసై కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులకు:
రూ.12,000/- నుంచి రూ.29,380/-
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు:
రూ.10,000/- నుంచి రూ.24,470/-
అప్లికేషన్ ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్/ ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2023 ఆగస్టు 3వ తారీకు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 ఆగస్టు 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి