TSPSC: గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్.. రోజుకు 45 వేలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల OMR షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడటంతో OMR స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పకడ్బందీగా చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ నెలలోనే గ్రూప్-4 ప్రాథమిక ‘కీ’ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 7,62,872 మంది అభ్యర్థులు ఈ నెల 1వ తారీకున పరీక్ష రాశారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-4 పేపర్-1&2 ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి