TSPSC: గ్రూప్-4 పరీక్షకు ఆరు పద్ధతుల్లో చెకింగ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ఆరు పద్ధతుల్లో చెకింగ్ చేయనున్నారు. పూర్తీ పారదర్శకంగా పకడ్బందీ ప్రణాలికతో పరీక్షలను నిర్వహించనున్నారు.
గ్రూప్-4కు ఆరు పద్ధతుల్లో తనిఖీలు
1.గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్టికెట్ను పరిశీలిస్తారు.
2.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఫొటో తప్పనిసరి).
3.పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ లోని పేరును పరిశీలిస్తారు.
4.నామినల్ రోల్, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.
5.అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.
6.చివరిగా అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలీగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.