గ్రామీణ బ్యాంకుల్లో 9,053 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు.. | IBPS Notification 2023
గ్రామీణ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,053 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. 2023 జూన్ 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. పరీక్ష తెలుగులో కూడా నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం.
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి: APP Link
పోస్టుల వివరాలు:
1.ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పన్): 5650 పోస్టులు
2.ఆఫీసర్ స్కేల్ -1 (ఏఎం): 2563 పోస్టులు
3.జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 367 పోస్టులు
4.ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 106 పోస్టులు
5.సీఏ ఆఫీసర్ స్కేల్ -2: 63 పోస్టులు.
8.లా ఆఫీస ర్ స్కేల్ -2: 56 పోస్టులు.
7. ట్రెజరీ మేనేజర్ స్కేల్ -2: 16 పోస్టులు.
8.మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 38 పోస్టులు
9.అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ -2: 118 పోస్టులు:
10.ఆఫీసర్ స్కేల్ -3 (సీనియర్ మేనేజర్): 76 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,053,
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2023 జూన్ 1వ తేదీ నాటికి..
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్సన్) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లు,
ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు.
ఆఫీసర్ స్కేల్ -2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు.
ఆఫీసర్ స్కేల్ -1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.175; మిగతా వారందరూ రూ.850. ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి రోజు:
2023 జూన్ 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి