TSPSC Group 4: గ్రూప్-4 బిట్ బ్యాంక్.. 1857 సిపాయిల తిరుగుబాటు
1857 సిపాయిల తిరుగుబాటు – ముఖ్యమైన ప్రశ్నలు
1.1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
Ans:మీరట్
2.1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి?
Ans:ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు
3.సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభం అయ్యింది?
Ans:1857 మే 10
4.1857 తిరుగుబాటుని మొదటి భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరు?
Ans:వి.డి.సావర్కార్
5.1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు?
Ans:లార్డ్ కానింగ్
6.పశ్చిమబెంగాల్ లో బరక్ పూర్ రేజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు?
Ans:మంగళ్ పాండే
7.1857 మే 11న సిపాయిలు వధించిన ఎర్రకోట లోని బ్రిటిష్ రెసిడెంట్ అధికారి ఎవరు?
Ans:సైమన్ రిప్లీ
8.లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు?
Ans:బేగం హజరత్ మహల్
9.ఢిల్లీలో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
Ans:భక్త్ ఖాన్
10.కాన్పూర్ లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
Ans:నానా సాహెబ్
11.ఢిల్లీలో తిరుగుబాటును అనచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు?
Ans:జనరల్ హాడ్సన్
12.కాన్పూర్ లో తిరుగుబాటును అణచివేసింది ఎవరు?
Ans:క్యాంప్ బెల్
13.1857 యుద్ధపు సమయంలో బ్రిటిష్ వారి సరసన చేరి, ఝాన్సీ లక్ష్మీబాయి తో పోరాటం చేసిన భారతీయ పాలకుడు ఎవరు?
Ans:గ్వాలియర్ రాజు జియాజీరావు సింధియా
14.మొదటి భారత స్వతంత్ర సంగ్రామం జరిగిన సంవత్సరం?
Ans:1857
15.1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నట్టు చెప్పబడే హైదరాబాదు నిజాము ఎవరు?
Ans:అఫ్జలుదౌలా
16.ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
Ans:లక్ష్మీబాయి
17.ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది?
Ans:1858 చట్టం
18.భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం అని లార్డ్ కానింగ్ ఎక్కడినుండి ప్రకటించారు?
Ans:అలహాబాద్ దర్బార్
19.1857 తిరుగుబాటును నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు?
Ans:కాయే
20.1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ప్రధాని ఎవరు?
Ans:హెన్రీ జాన్ టెంపుల్
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి