December 20, 2024
All India Govt Jobs

2,674 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు.. | EPFO SSA Notification 2023

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 26న దరఖాస్తు గడువు ముగియనుంది. దేశవ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్ఓ రీజియన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్: 2,674 పోస్టులు
(ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో 39, తెలంగాణ రీజియన్ లో 116 ఖాళీలు ఉన్నాయి).

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:

రూ.700/- ( ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

జీతభత్యాలు:

నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు

ఎంపిక విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 27వ తారీకు నుంచి 2023 ఏప్రిల్ 26వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!