TS Constable Jobs 2023: తెలంగాణ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదల.. సాంకేతిక విభాగం
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్షలు (సాంకేతిక విభాగం) కొనసాగుతున్నాయి. పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్ అలాగే అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 2న ఉదయం 10.00 గంటల నుంచి 1.00 వరకు డ్రైవర్ పోస్టులకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెకానిక్ పోస్టులకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు మార్చి 28వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లో ఇబ్బందులుంటే 9393711110 లేదా 9391005006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. హాల్ టికెట్ పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని స్పష్టంచేశారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు