గ్రూప్-4 పరీక్ష తేదీ, హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు తమ OTPR ID, పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. 2023 ఏప్రిల్ 4వ తారీకున రెండు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, స్కీనింగ్ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు