December 20, 2024
TS Govt Jobs

TSPSC: గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులకు ఊహించని పోటీ.. ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తారీకుల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాల పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంది.
గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 విభాగంలో 1,375 పోస్టులకు గాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-4 విభాగంలో 8,180 పోస్టులకు గాను 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!