తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తులకు రేపే ఆఖరు..
తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
గ్రూప్-3: 1,375 పోస్టులు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 24వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80
జీతభత్యాలు:
రూ.24,280/- నుంచి 96,890/- వరకు
ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు