AP SSC Hall Tickets 2023: మార్చి 15 తర్వాత పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. పాఠశాల ఫీజు కట్టలేదని కొన్ని స్కూళ్లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.