TS DSC 2023: 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి వేదికగా మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరికల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం డీఎస్సీ నోటిఫి కేషన్ వెలువడనుందన్నారు. బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నది తేలుతుందన్నారు. దాదాపు 20వేల ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.