TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 7 మార్కుల క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల.. PDF Download
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై , కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలిపి ఫలితాలను విడుదల చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులు కలిపి క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క ఫలితాలను విడుదల చేసింది. మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ www.tslprbin వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు పార్ట్-2 అప్లికేషన్ భర్తీ చేయాలి. మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ (PMT/PET) ఉంటాయని TSLPRB తెలిపింది. PMT/PET అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 నుంచి 10వ తారీఖు వరకు www.tslprb.in వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు.