December 20, 2024
TS Govt Jobs

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల.. డిసెంబర్ లో పరీక్షలు | TGPSC Group-2 Exams Postponed

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేశారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ విడుదల చేసింది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారికంగా వెబ్ నోట్ విడుదల చేసింది. డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఖచ్చితమైన తేదీలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను ఆగస్టు 7, 8 తారీకుల్లో నిర్వహించాల్సి ఉంది.. కానీ నిరుద్యోగుల ఆందోళన మేరకు పరీక్షలను వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తారీఖు వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీఎస్సీ పరీక్షలో పూర్తయిన వెంటనే గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నందున.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

నిరుద్యోగుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!