TTD Recruitment 2023 | 57వేల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. AEE, AE, ATO పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని “తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)” నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 23వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
2.అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు
3.అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56.
విద్యార్హతలు:
బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్సీఈ/ ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.AEE పోస్టులకు:
రూ.57,100/- నుంచి 1,47,760/- వరకు
2.AE పోస్టులకు:
రూ.48,440/- నుంచి 1,37,220/- వరకు
3.ATO పోస్టులకు:
రూ.37,640/- నుంచి 1,15,500/- వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2023 నవంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింకుపై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి