తెలంగాణ ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TSRTC Recruitment 2024
TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ నుంచి త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ నుంచి త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం మంత్రి పొన్నం జహీరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
టీఎస్ఆర్టీసీ త్వరలో చేపట్టనున్న ఖాళీ పోస్టులలో డ్రైవర్ 2000 పోస్టులు, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, ఎకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతనే నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో సైతం 100 శాతానికి చేరుకుంది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పని చేయాల్సి వస్తోంది. దీంతో ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి