తెలంగాణ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. మెరిట్ ద్వారా భర్తీ | TSRTC Recruitment 2024
TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు మరో 2 రోజుల్లోపు దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు…
1.హైదరాబాద్ రీజియన్- 26
2.సికింద్రాబాద్ రీజియన్- 18
3.మహబూబ్ నగర్ రీజియన్- 14
4.మెదక్ రీజియన్- 12
5.నల్గొండ రీజియన్- 12
6.రంగారెడ్డి రీజియన్- 12
7.ఆదిలాబాద్ రీజియన్- 09
8.కరీంనగర్ రీజియన్- 15
9.ఖమ్మం రీజియన్- 09
10.నిజామాబాద్ రీజియన్- 09
11.వరంగల్ రీజియన్- 14
మొత్తం ఖాళీల సంఖ్య: 150
విద్యార్హతలు:
బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటిస్ వ్యవధి:
మూడు సంవత్సరాల పాటు శిక్షణను ఇస్తారు.
జీతభత్యాలు:
మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000/-, రూ.16000/-, రూ.17000/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
2024 ఫిబ్రవరి 16 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.