TSPSC | పురపాలక శాఖలో అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు.
దరఖాస్తు విధానం:
2023 జనవరి 20 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు: బీకాం డిగ్రీ పూర్తీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
రూ.32,810/- నుంచి రూ.1,24,150/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
రెండు పేపర్లు ఉంటాయి: పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పేపర్-2 కామర్స్ (డిగ్రీ లెవెల్) నుంచి 150 ప్రశ్నలు వస్తాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
మొత్తం 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
BC అభ్యర్థులకు 35 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 30 మార్కులు రావాలి.
సిలబస్:
పేపర్-1&2 సిలబస్ సంబంధించిన పూర్తీ వివరాలు క్రింది పట్టికలో చూడగలరు.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.