TSPSC Group-4 Results | తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడంటే?
TSPSC Group-4 Results 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. దసరా తర్వాత జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే తుది ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. దసరా తర్వాత జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. గ్రూప్-4 కేటగిరిలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించి తుది ‘కీ’ వెల్లడించిన కమిషన్ పేపర్-1లో ఏడు ప్రశ్నలు పేపర్-2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుది ‘కీ’ వెల్లడి కావడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ జాబితాలో ఉండనున్నాయి. దసరా పండగ తరువాత మెరిట్ జాబితా ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక తుది ఫలితాలు విడుదల చేయనున్నది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి