TSPSC: గ్రూప్-4 ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ.. రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు TSPSC దరఖాస్తులను నిర్వహించింది. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-4 పరీక్షలను 2023 జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 ఉద్యోగాల కోసం గ్రూప్-4 పరీక్షలు నిర్వహిస్తున్నారు.