TSPSC Group 4: ఇలా చదివితే గ్రూప్ 4 జాబ్ ఈజీ
తెలంగాణ ప్రభుత్వం 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పేపర్ 1 లోని జనరల్ నాలెడ్జ్ విభాగంలో సిలబస్ లో ఇచ్చిన అంశాలను ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. పేపర్-1 లో ఉన్న జనరల్ నాలెడ్జ్ అంశాల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా సిలబస్ పై పూర్తి అవగాహన ఉండాలి. సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ సిలబస్ ఒకటే అని భావిస్తారు . కాని సబ్జెక్ట్ ఒకటే అయినా సబ్జెక్టులో ఉన్న అంశాలు ఒకటి కావు . కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి . జనరల్ నాలెడ్జ్ పేపర్ 1 లో మొత్తం 11 అంశాలు ఉంటాయి.
సిలబస్:
పేపర్-1:- ఇందులో మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు ఇస్తారు. సిలబస్ లో 1.కరెంట్ అఫైర్స్, 2.అంతర్జాతీయ సంబంధాలు – సంఘటనలు, 3.నిత్య జీవితంలో జనరల్ సైన్స్, 4.పర్యావరణ సమస్యలు , విపత్తు నిర్వహణ , 5.భారతదేశ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, 6.భారత రాజ్యాంగం – ప్రధాన లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, 7.ప్రభు త్వం మరియు జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, 8.తెలంగాణ చరిత్ర , 9.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 10.తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, 11.తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉన్నాయి. ఇలా సబ్జెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు కాకుండా సిలబస్ లో ఉన్న టాపిక్స్ ప్రిపేర్ అయితే గ్రూప్-4 జాబ్ కొట్టడం సులువే.
సిలబస్ కు సంబంధించిన పూర్తీ వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి.