TS Police Jobs: తెలంగాణ పోలీస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. TSLPRB ఆధ్వర్యంలో 17,516 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన తుది రాతపరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసిన బోర్డు, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. త్వరలోనే ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి