TS SI Constable Results 2023: ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఫలితాలు.. కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. జీవో 57, 58కి సంబంధించి కొందరు అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల మొదటివారంలోనే విడుదల కావాల్సిన ఎస్సై తుది పరీక్ష ఫలితాలు.. మూడో వారానికి వాయిదా పడ్డట్టు టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు అడిగిన ప్రశ్నలకు బోర్డు ప్రత్యుత్తరం ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన అభ్య ర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనుంది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. అర్హత సాధించిన వారికి షెడ్యూల్ ప్రకారం శిక్షణకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలు సెప్టెంబర్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి