TS SI Constable Results | వచ్చే వారంలో ఎస్ఐ మెరిట్ లిస్ట్ విడుదల.. ఆ తర్వాత కానిస్టేబుల్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ముమ్మరం చేసింది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు… ఇలా దాదాపు 180కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కుల్ని నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది ఎంపికల జాబితాను ప్రకటిస్తారు.
అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో తుది జాబితా వెలువడే అవకాశముంది. అయితే… మొదట ఎస్సైలుగా ఎంపికైన 579, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్ లాగ్ ను నివారించవచ్చనేది నియామక మండలి ఆలోచన. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి తొలుత ఎస్సై జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత మరి కొద్ది రోజులకు కానిస్టేబుల్ జాబితాను విడుదల చేయనున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి