Mega DSC 2024: 20వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్?
Mega DSC 2024: తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త అందించనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 19వేల నుండి 20వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త అందించనుంది. మెగా డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సీఎం సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు.
ఇప్పటికే 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో తొమ్మిది వేల వరకు ఖాళీలు తేలే వీలుంది. వీటన్నింటినీ డీఎస్సీలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులను కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19వేల నుంచి 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్క వేస్తున్నారు. డీఎస్సీ నిర్వహణకు అవసరమైన కసరత్తు 15 రోజుల్లో పూర్తీ చేసి ముఖ్యమంత్రికి నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆ తరువాత డీఎస్సీ నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి