TS Mega DSC 2024: తెలంగాణలో 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
TS Mega DSC 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. మార్చి 4వ తారీకు నుంచి ఏప్రిల్ 2వ తారీకు వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
స్కూల్ అసిస్టెంట్: 2,849
ఎస్జీటీ పోస్టులు: 7,304
భాషా పండితులు: 727
పీఈటీ పోస్టులు: 182
మొత్తం పోస్టుల సంఖ్య: 11,062
5,089 పోస్టులతో గత ఏడాది విడుదల చేసిన డీఎస్సీ-2023 నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టులను పెంచి గురువారం కొత్తగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.