Telangana Government Jobs: 10th క్లాస్ అర్హతతో సమాచార, పౌర సంబంధాల శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఆఫీస్ సబార్డినేట్, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులు
TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సహాయ పౌరసంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్), పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియోగ్రాఫర్ పోస్టు), ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్, 10th క్లాస్, డిగ్రీతో పాటు జర్నలిజంలో డిప్లొమా అర్హత అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు డీపీఆర్వో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కలెక్టర్ నియమించిన జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
పోస్టుల వివరాలు:
1.సహాయ పౌరసంబంధాల అధికారి
2.పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్)
3.పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియోగ్రాఫర్)
4.ఆఫీస్ సబార్డినేట్
విద్యార్హతలు:
1.సహాయ పౌరసంబంధాల అధికారి:
జర్నలిజంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు (లేదా) సాధారణ బ్యాచిలర్ డిగ్రీతో పాటు జర్నలిజంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్):
10వ తరగతి విద్యార్హత కలిగి, ఏదైనా రిఫ్యూటెడ్ ఫొటోస్టూడియోలో కనీసం ఐదేళ్లు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫీస్ సభార్డినేట్
7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
అభ్యర్థులు తమ బయోడేటా ఫారంకు అర్హత పత్రాలను జతపరిచి కలెక్టరేట్ లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 9వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింకు పై క్లిక్ చేసి పత్రికా ముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో గ్రూప్-3, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింకు పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి