TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులు
పురుషులు: 31 పోస్టులు, మహిళలు: 19 పోస్టులు
దరఖాస్తు విధానం:
2023 జనవరి 21 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2023 జనవరి 11 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
OC, BC అభ్యర్థులు: రూ.600/-
SC, ST అభ్యర్థులు: రూ.400/-
జీతం:
రూ.19,000/- నుంచి రూ.58,650/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత/OMR ఆధారిత పరీక్ష, ఓరల్ ఇంటర్వ్యూ (Viva Voice) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 45 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 45 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓరల్ ఇంటర్వ్యు 5 మార్కులకు ఉంటుంది. 2023 మార్చి నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 45 మార్కులు రావాలి,
BC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 35 మార్కులు రావాలి.
సిలబస్:
ప్రశ్నపత్రంలో జనరల్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు ఉంటాయి.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.