తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Health Department Jobs 2024
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య డైరెక్టరేట్(డీఎంఈ), వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ, ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రి, ఐఐపీఎం, ఆయుష్, ఔషధ నియంత్రణ మండలిలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు:
అత్యధికంగా వైద్యవిద్య డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేస్తారు. వైద్య విధాన పరిషత్ లో 1255, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 575, ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రిలో 212, ఐఐపీఎం విభాగంలో 34, ఆయుష్ విభాగంలో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, బయోమెడికల్, ఆడియో విజువల్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్లు సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
స్టాఫ్ నర్స్: 1,988 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్: 764 పోస్టులు
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 1,014 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 596 పోస్టులు
తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు
తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.