తెలంగాణ చేనేత జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. హైదరాబాదులోని తెలంగాణ చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 15
విద్యార్హతలు:
డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తోపాటు చేనేత రంగంలో రెండేళ్ల పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.24,000/-
ఎంపిక విధానం:
విద్యార్హత, పని అనుభవం, వయస్సు, స్థానికత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
చేనేత జౌళి శాఖ కమిషనర్, మూడవ అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ-500 001 చిరునామాకు దరఖాస్తులు పంపవలెను.
నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 04/02/2023
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు