తెలంగాణ అగ్నిమాపక శాఖలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ | TS Fire Department Jobs Recruitment 2024
TS Fire Department Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. అగ్నిమాపక శాఖలో త్వరలో 1,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. అగ్నిమాపక శాఖలో త్వరలో 1,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ శాఖ సిబ్బందికి పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన సందర్భంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అగ్నిమాపక శాఖకు దాదాపు 3 వేల పోస్టులు మంజూరయ్యాయని, ఇటీవలే 491 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసిందని, దీంతో దాదాపు 2000 మంది సిబ్బంది సమకూరినట్లు అయిందని తెలిపారు. మిగిలిన 1000 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయని సీఎం తెలిపారు.
అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డ్రైవర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్.. తదితర పోస్టులను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.