TS Govt Jobs: తెలంగాణలో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్ (స్కూల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమం, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమం, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పర్మినెంట్ ప్రాతిపదికన 434 లైబ్రేరియన్ (స్కూల్స్) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఏప్రిల్ 24వ తారీకు నుంచి 2023 మే 24వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
లైబ్రేరియన్ (స్కూల్స్): 434 పోస్టులు
సొసైటీల వారీగా ఖాళీల వివరాలు:
- తెలంగాణ సాంఘిక సంక్షేమం: 54 పోస్టులు
- తెలంగాణ బీసీ సంక్షేమం: 180 పోస్టులు
- తెలంగాణ మైనార్టీ సంక్షేమం: 200 పోస్టులు
జీతభత్యాలు:
నెలకు రూ.38,890/- నుంచి రూ.1,12,510/- వరకు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఏప్రిల్ 24వ తారీకు నుంచి 2023 మే 24వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు, వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక విధానం వివరాల కొరకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లో చూడండి. పూర్తి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన రోజు (24/04/2023) నుంచి TREIRB అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి