TGPSC: తెలంగాణ గ్రూప్-4 మెరిట్ లిస్ట్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
TG Group-4 Merit List: తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్, అటస్టేషన్ ఫారాలు డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.
ధ్రువపత్రాల పరిశీలనకు కావలసినవి:
కులధ్రువీకరణ, బీసీ నాన్ క్రీమీలేయర్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని కమిషన్ తెలిపింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల యొక్క లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.