TG Govt Jobs: తెలంగాణలో మార్చి 8న 14,236 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత: ఇంటర్మీడియట్
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 8వ తారీకున 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆరోజు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. సభ నిర్వహణపై శనివారం ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.
కొత్తగా విడుదల చేసే అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. గతంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి కనీసం పదవ తరగతి పాసై ఉండాలి అనే నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు.
అంగన్వాడి ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,236 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
▶️జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

✅తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.